టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగేశ్వర రావు నుండి నాగర్జున వరకు తెలుగు చిత్ర సీమలో మంచి పేరు ఉన్న వారే. వీరి వారసత్వంతో నాగర్జున ఇద్దరు కొడుకులు హీరోలుగా పరిచయం అయ్యారు. 2009 లో జోష్ సినిమాతో నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2015 లో అఖిల్ అనే సినిమాతో చిన్న కొడుకు అఖిల్ హీరోగా పరిచయం అయ్యాడు.
ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబం అయినా, కెరీర్ ప్రాంరంభంలో ఇద్దరు ఇబ్బంది పడ్డారు. నాగ చైతన్య “మజిలీ” సినిమా నుండి మంచి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం “థాంక్యూ” అనే సినిమా చేస్తున్నాడు. అఖిల్ కూడా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాతో సక్సెస్ ను అందుకుని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం “ఏజెంట్” అనే స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.
ఈ అక్కినేని హీరోల రాబోయే సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. మంచి విజయం సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా, అక్కినేని బ్రదర్స్ ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పుటి నుండో చూస్తున్నారు. కానీ, అక్కినేని బ్రదర్స్ దీని గురించి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా నోరు విప్పలేదు.
కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ తో సినిమా పై అక్కినేని నాగ చైతన్య స్పందించాడు. అఖిల్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు. అంతే కాదు కథలు కూడా వింటున్నట్టు చెప్పాడు. స్టోరీ నచ్చితే, త్వరలోనే సినిమా వస్తుందని అని వెల్లడించాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. అక్కినేని బ్రదర్స్ ను ఒకే స్క్రిన్ పై చూడటానికి వెయిట్ చేస్తున్నారు.