Naa Peru Seesa : మ్యాజికల్ వాయిస్, హాట్ డాన్స్

ఒక సినిమా హిట్ కావాలంటే, కామెడీ, యాక్షన్, రొమాన్స్ అన్ని సమాన మోతాదు లో ఉండాలి. దీనికి తోడు ఐటెం సాంగ్ కూడా తప్పనిసరి. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ రావడం ఆనవాయితీగా మారింది. ప్రేక్షకులను తమ సినిమా వైపు తిప్పుకోవడానికి ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. మేకర్స్. హీరోయిన్స్ తో మాస్ డ్యాన్స్ లు చేయించి, క్యాష్ చేసుకుంటున్నారు. ఐటెం సాంగ్స్ లో ముందగా, అవకాశాలు లేని హీరోయిన్స్ మాత్రమే చేసేవారు. కానీ, ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ కూడా చేస్తున్నారు.

ఇదీలా ఉండగా, మాస్ మహారాజు రవితేజ హీరోగా నటిస్తున్న రామరావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంది. ఈ ఐటెం సాంగ్ లో ప్రముఖ మోడల్ అన్వేషి జైన్ చిందేసింది.”నా పేరు సీసా..” అంటూ సాగే ఈ పాటను ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు. ఈ లిరిక్స్ ను ప్రముఖ రచయిత చంద్రబోష్ అందించాడు. అలాగే శ్రేయా ఘోషల్ ఈ పాటను పాడారు. సామ్ సీ.ఎస్ సంగీతాన్ని అందించాడు.

ఈ పాటకు అందం అన్వేషి జైన్ అనే చెప్పొచ్చు. దీంతో పాటు శ్రేయా ఘోషల్ మ్యాజికల్ వాయిస్ హైలైట్ గా నిలుస్తోంది. అలాగే సామ్ సీ.ఎస్ సంగీతం కూడా ప్లస్ గా ఉంది. మొత్తంగా రామరావు ఆన్ డ్యూటీ కు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ లో ఇదే కాస్త గొప్పగా ఉందని చెప్పొచ్చు.

- Advertisement -

అయితే, ఈ ఐటెం సాంగ్ కోసం అన్వేషి జైన్ ను మేకర్స్ ఎంపికచేయడానికి కారణం లేక పోలేదు. ఎద సంపదతో కుర్రకారుకు మత్తేక్కించే ఈ భామకు ఫాలోయింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ భామ సాంగ్ లో ఉంటే, వచ్చే హాట్ నెస్ అంతా ఇంత కాదు. యూత్ ను ఆకర్షించేందుకు అన్వేషి జైన్ తప్పకుండా ఉపయోగపడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు