మ్యాచో స్టార్ గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న ఆడియన్స్ తో సినిమా చూసిన అందాల బ్యూటీ రాశిఖన్నా తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
నేను చాలా సినిమాలు ఆడియన్స్ తో పాటు చూస్తుంటాను,
ఆడియన్స్ తో సినిమా చూసే అవకాశం వేరే చోట ఉండదు.
ఆడియన్స్ తో థియేటర్ లో సినిమా చూసే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది.
లాయర్ ఝాన్సీ కేరక్టర్ తో మారుతి గారు నాకు మంచి స్కోప్ ఇచ్చారు. ఈ కేరక్టర్ నేను బాగా చేయడం కోసం మారుతి గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 8 ఇయర్స్ జర్నీ లో నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి యాక్టర్స్ లైఫ్ లో హైస్ ఉంటాయి , లోస్ ఉంటాయి.అలానే నా లైఫ్ లో కూడా ఉన్నాయ్, కానీ ప్రస్తుతం నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.
ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలకు సైన్ చేశాను, అవి ఇంకా ఆఫీసియల్ గా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చెయ్యాల్సి ఉంది. ఒక వెబ్ సిరీస్ షూట్ అయిపోయి, ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతుంది. అలానే కార్తీ తో చేస్తున్న “సర్ధార్” మూవీ షూటింగ్ ఇంకాస్త మిగిలుంది.
తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఇప్పుడు అప్పుడే చెప్పలేను పెళ్లి జరిగినప్పుడు భవిష్యత్ లో అందరికి తెలుస్తోంది అంటూ పలు విషయాలు పంచుకున్నారు రాశీ ఖన్నా.