Mythri Movie Makers : మళ్ళీ అదే తప్పు !

నాని –వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అంటే సుంద‌రానికీ!’ చిత్రం శుక్ర‌వారం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అయిన విషయం తెలిసిందే. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది ఈ సినిమా. నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే నిడివి గురించి మాత్ర‌మే మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ సినిమా 3 గంట‌ల పైనే ఉంది. కానీ, ఎక్కువగా నెగిటివిటీ నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ పై వస్తుంది. దీనికి కారణం లేక పోలేదు.

‘అంటే సుందరానికీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోతుంది. విడుదల రోజు మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్స్ పడ్డ థియేటర్లు తిప్పి కొడితే 20 కూడా లేవు. దానికి ప్రధాన కారణం టికెట్ ధరలే అని చెప్పొచ్చు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో ఈ చిత్రం టికెట్ ధరలు రూ.175, మల్టీప్లెక్సుల్లో రూ.250 ఉన్నాయి. గతవారం ‘మేజర్’ ’విక్రమ్’ సినిమాలు ఇప్పటికీ రాణిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఆ సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించారు నిర్మాతలు. కానీ ‘అంటే సుందరానికీ!’ విషయంలో అలా జరగలేదు.

టికెట్ల ధరలను తగ్గించకపోవడనికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ అని సినీ లవర్స్ అభిప్రాయం. ఈ బ్యానర్ నుండి వచ్చిన ‘పుష్ప’ ‘సర్కారు వారి పాట’ సినిమాలు 3 వారాలకే ఓటీటీకి ఇచ్చేశారు. నాని సినిమా విషయంలో కూడా జనాలు అదే విధంగా భావిస్తున్నారు. ఈ కారణాలతో ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు