Pawan Kalyan : ఇక కష్టమేనా ?

సినీ నటులు రాజకీయాల్లో రాణించడం కొత్తేమీ కాదు. తమిళంలో ఎంజీ రామచంద్రన్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు తో పాటు చాలా మంది రాజకీయాల్లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం కాలంలోనూ చాలా మంది నటీ నటులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అందులో ముందుగా చెప్పుకునే పేరు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల “వకిల్ సాబ్” సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన పవన్, “భీమ్లానాయక్” తో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చాడు.

ఈ సినిమా తర్వాత అభిమానుల్లో పవర్ స్టార్ పై నమ్మకం భారీగా పెరిగింది. దీనికి అనుగుణంగా పవన్ కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక్కడే పవన్ కళ్యాణ్ కు అసలు సమస్య వచ్చింది. అటు రాజకీయాలను, ఇటు సినిమాలను మేనేజ్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. దీని వల్ల షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి.

పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరి హర వీరమల్లు”, హరీష్ శంకర్ తో “భవదీయుడు భగత్ సింగ్”, సముథ్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో “వినోదయ చిత్తం” రీమేక్ తో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఇందులో “హరి హర వీరమల్లు” మినహా అన్ని సినిమాలు షూటింగ్ ను స్టార్ట్ చేయలేదు. “హరి హర వీరమల్లు” ను పూర్తి చేసి, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రచారం చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. కొద్ది రోజుల్లోనే పవన్, ఆంధ్ర ప్రదేశ్ లో బస్సు యాత్ర చేయాలని ప్లాన్ కూడా చేశారట.

- Advertisement -

అయితే, ఇటీవల “అంటే సుందరానికి” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నట్టు పవన్ స్పష్టంగా చెప్పాడు. కానీ, ప్రస్తుతం ఆయన మనసు మార్చుకుని, సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే పవన్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో, ఇక సినిమాలు చేయడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే పవన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు