క్రేజీ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో హీరో కనిపించనున్నాడట. ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక స్పెషల్ ఎపిసోడ్‌లో సీనియర్ హీరో మోహన్ లాల్ కనిపించబోతున్నట్టు సమాచారం. ప్లాష్ బాక్ ఈ సినిమా మొత్తానికీ కీలకం కానుంది.
అందుకోసమే ఈ పాత్ర కోసం దర్శకుడు శంకర్ మోహన్‌లాల్‌ని ఎంపిక చేసుసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడట. వెరీ స్టైలీష్ లుక్‌లో విభిన్న శైలిలో చరణ్, ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడట. ఇక ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపించగా, మరో పాత్రలో స్టైలిష్ గా కనిపించనున్నాడట.
చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పని చేస్తున్నాడు. అలీమ్ హకీమ్ ఈ చరణ్‌కోసం కొత్త లుక్‌ని డిజైన్ చేసినట్టు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బరువైన ఎమోషన్స్‌తో పాటు విజువల్స్ కూడా భారీగానే ఉండనున్నాయట. శంకర్-చరణ్ కాంబోలో వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదలయ్యేంత వరకు వేచి చూడాలి.