Meena : అందం చెర‌గ‌దు.. అభిమానం త‌గ్గ‌దు !

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి మీనా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌ం లేదు.  ఆమె తొలుత బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. అందం, అభిన‌యంతో ఎన్నో సినిమాల్లో న‌టించి దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు అగ్ర‌హీరోయిన్‌గా త‌న కెరీర్ కొన‌సాగించింది. ముఖ్యంగా ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో కూడా మీనా న‌టించ‌డం విశేషం. ఇప్ప‌టికీ కూడా మీనాకి ఆఫ‌ర్లు వస్తున్నాయి.

మీనా 1976 సెప్టెంబ‌ర్ 16న మ‌ద్రాస్‌లో జ‌న్మించారు. శివాజీ గ‌ణేశ‌న్ న‌టించిన నెంజ‌న్ గ‌ల్ చిత్రంలో మొద‌టిసారి తెర‌మీద క‌నిపించారు. ఇక టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన సిరిపురం మొన‌గాడు చిత్రం ద్వారా అడుగుపెట్టింది. బావ మ‌ర‌ద‌ళ్లు, సూర్య‌చంద్ర‌, కోడెత్రాచు, ఇల్లాలు ప్రియురాలు, సిరివెన్నెల వంటి చిత్రాల్లో బాల‌న‌టిగా చేశారు. విజ‌య‌శాంతి న‌టించిన ‘క‌ర్త‌వ్యం’ సినిమాలో మీనా కీల‌క పాత్ర పోషించారు.

 

- Advertisement -

ప్ర‌ధానంగా ఏఎన్నార్‌తో క‌లిసి న‌టించిన ‘రాజేశ్వ‌రి క‌ళ్యాణం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకి ఆమె ఉత్త‌మ న‌టి కేటగిరిలో నంది అవార్డును దక్కించుకుంది.  ర‌జినీకాంత్‌తో ‘ముత్తు’ సినిమాలో ముగ్ద‌మ‌నోహ‌ర‌మైన రూపంతో క‌నిపించింది. తెలుగు ఇండ‌స్ట్రీలో చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున, బాల‌కృష్ణ వంటి అగ్ర హీరోల స‌ర‌స‌న ఎన్నో సినిమాల్లో న‌టించింది. ముఖ్యంగా వెంక‌టేష్‌తో మీనా ఎక్కువ సినిమాలు చేసింది. వెంక‌టేష్‌తో న‌టించిన చంటి సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌ం లేదు. బెంగ‌ళూరుకి చెందిన ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగ‌ర్ ను 2009లో పెళ్లి చేసుకున్నారు. సినీ ఇండ‌స్ట్రీకి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చింది.

ఈ ఏడాది జూన్ 28న మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ శ్వాస కోశ సంబంధిత వ్యాధితో మ‌రణించాడు. మీనా- కీ.శే. విద్యాసాగ‌ర్ దంప‌తులకు నైనిక అనే అమ్మాయి ఉంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండకుండా దృశ్యం, దృశ్యం2 తో పాటు  మ‌రి కొన్ని చిత్రాల్లో న‌టించింది. దృశ్యం 3లో కూడా న‌టించేందుకు సిద్ధంగా ఉంది. మ‌రోవైపు కూతురు నైనిక బాధ్య‌త‌ను చూసుకుంటుంది. ఒకానొక సంద‌ర్భంలో మాత్రం సినిమాల్లో న‌టించ‌ను అని చెప్ప‌డం విశేషం. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఇవాళ మీన‌కు ‘filmify’ త‌రుపున‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఇలాంటి జ‌న్మ‌దిన వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

 

Previous article
Next article

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు