Maruthi-Chiranjeevi : మెగా ఆఫర్ !

దర్శకుడు మారుతి. కామెడీ సినిమాలతో కెరీర్ ప్రారంభించి, స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రం ఇంకా స్టార్ కాకుండా, మారుతికి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ డైరెక్టర్ తో వర్క్ చేస్తానని మెగా స్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైం నుండి మారుతి తెలుసు అని, అప్పట్లో గ్రాఫిక్స్ విభాగంలో పనిచేసేవారు అని, ఆ టైంలోనే మారుతిలో మంచి దర్శకుడు ఉన్నట్టు గుర్తించాను అని తాజాగా చిరు పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు చిరు.

మారుతి పెద్ద దర్శకుడు అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రామ్ చరణ్ కు యూవీ క్రియేషన్స్ లో భాగమైన విక్రమ్ మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. మారుతి – యూవీ విక్రమ్ కలిసి తన కోసం ఓ ప్రాజెక్టును సెట్ చేయాలని అన్నారు. ఆ ప్రాజెక్టులో నటించడానికి సిద్ధం అని పక్కా కమర్షియల్ స్టేజి పై హామీ ఇస్తున్నట్టు చిరు తెలిపారు. అయితే ఇది వర్కౌట్ అవ్వాలి అంటే ముందుగా మారుతి ప్రభాస్ తో ఓ మంచి హిట్టు కొట్టాలి అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు