Manchu Vishnu: టైటిల్ తెచ్చిన తంటా

“విష్ణు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు “ఢీ” సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు, ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా “ఢీ” సినిమా స్థాయిలో హిట్ అవ్వలేదు. ఈ మద్యకాలంలో విష్ణు సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ , మా అధ్యక్షత బాధ్యతలు ఈ గ్యాప్ కి కారణం కావచ్చు.

ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలపై దృష్టి పెట్టి రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఢీ అంటే ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు విష్ణు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దీనితో పాటుగా సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది.తాజాగా ఈ మూవీ టైటిల్‌ను “జిన్నా” అని అనౌన్స్ చేశారు మంచు విష్ణు అండ్ టీం. ఇక్కడే అసలైన చిక్కులు మొదలయ్యాయి.

పాకిస్తాన్ కి చెందిన మహ్మద్ అలీ జిన్నా పేరుతో సినిమాను చేస్తున్నారని, దానికి తోడు రిలీజ్ చేసిన వీడియోలో తిరుమల కొండల మధ్య నుంచి ఈ టైటిల్ రివీల్ అవ్వడం వలన మత విద్వేషాలకు దారి తీస్తున్నారని, ఒక వర్గపు ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

- Advertisement -

దీనికి కోన వెంకట్ బదులిస్తూ.. ఈ కథలో హీరో పేరు ‘‘ గాలి నాగేశ్వర రావు’’ అని అతడి పేరు అతనికే నచ్చదని, అందుకే జి.నాగేశ్వర రావుని ‘జిన్నా’గా మార్చుకుంటాడు అని క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడితో ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు