‘రొమాంటిక్’ ‘లక్ష్య’ చిత్రాల్లో తన గ్లామర్ తో యూత్ ని అమితంగా ఆకట్టుకుంది కేతిక శర్మ. ప్రస్తుతం ఆమె మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది పూర్తయిన వెంటనే ఆమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం. అలా అని ఆమె పవన్ కు జోడీగా నటిస్తోంది అని కాదు. ఈ చిత్రంలో పవన్ తో పాటు పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. అతనికి జోడీగా కేతికా శర్మ నటించనుందని తెలుస్తోంది. ఇది తమిళ చిత్రమైన ‘వినోదయ సీతం’ కి రీమేక్ గా తెరకెక్కనుంది.
‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో పవన్ మరోసారి గోపాల గోపాల తరహాలో దేవుడు పాత్ర పోషించనున్నారు. జూలై నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 4 నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ను కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. పవన్ ఈ చిత్రం కోసం 16 రోజుల కాల్షీట్లు కేటాయించినట్టు తెలుస్తుంది.