కళ్యాణ్ కృష్ణ సమర్పణలో ‘లంబసింగి’ మూవీ

వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్న కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత జీకే మోహన్ ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. సరికొత్త కంటెంట్ చిత్రాలని రూపొందించే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న కాన్సెప్ట్ ఫిల్మ్ తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌ను ప్రకటించింది. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి కథానాయికగా కనిపించనుంది.

ప్రతిభ గల కొత్త నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంతో భరత్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి లంబసింగి అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక.

- Advertisement -

ఆర్ఆర్ దృవన్ సంగీతం అదించిన ఈ చిత్రం నుండి మొదటి పాట ”నచ్చేసిందే నచ్చేసిందే”ని ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ రోజు పాటకు సంబధించిన ప్రోమోను విడుదల చేశారు. మెస్మరైజ్ చేస్తున్న ఈ రొమాంటిక్ మెలోడీని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. ఈ ప్రోమో పూర్తి పాట కోసం ఎదురుచూసేలా ఆసక్తిని పెంచింది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

కె బుజ్జి సినిమాటోగ్రాఫర్ గా, కె విజయ్ వర్ధన్ ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

తారాగణం: భరత్, దివి
సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: జికె మోహన్
సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల
బ్యానర్: కాన్సెప్ట్ ఫిల్మ్స్
డివోపీ : కె బుజ్జి
సంగీతం: ఆర్ఆర్ దృవన్
ఎడిటర్: కె విజయ్ వర్ధన్
పీఆర్వో : వంశీ-శేఖర్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు