న‌య‌న‌తార త‌న‌ పాల‌సీని బ్రేక్ చేస్తుందా..?

టాలీవుడ్ తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల్లో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వారిలో న‌య‌న‌తార ఒక్క‌రు. 2003 ఓ మ‌ల‌యాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. వెనువెంట‌నే త‌మిళ‌, తెలుగు భాషాల్లో కూడా అరంగేట్రం చేసింది. అనంత‌రం కొద్ది రోజుల్లోనే లేడీ సూప‌ర్ స్టార్ బిరుదును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త‌ర్వాత‌ న‌య‌నతార ఒక పాలసీని పెట్టుకుంది.

ఎన్ని సినిమాలు చేసినా.. ప్ర‌మోష‌న్స్ కు మాత్రం వెళ్ల‌దు. ర‌జ‌నీకాంత్, చిరంజీవి లేదా ఇంకా ఎవ‌రైనా.. అగ్ర హీరోల సినిమాలు అయినా.. ప్ర‌చారానికి దూరంగానే ఉంటుంది. దీని కోసం ముందుగానే ప్రొడ్యూస‌ర్ల‌తో ఒప్పందం కూడా చేసుకుంటుంది. న‌య‌న్ దాదాపు ప‌దేళ్ల నుంచి ఇదే పాలసీని ఫాలో అవుతూ వ‌చ్చింది. కానీ ఇప్పుడు ఆ పాల‌సీని బ్రేక్ చేసే స‌మ‌యం వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

ఎందుకంటే.. న‌య‌న‌తార ప్ర‌స్తుతం విజ‌య్ సేతుపతి, స‌మంతతో కాతువాకుళ రెండు కాద‌ల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్ గా న‌య‌న‌తార‌నే వ్య‌వ‌హ‌రిస్తుంది. అలాగే న‌య‌న్ బాయ్ ఫ్రెండ్.. విఘ్నేష్ శివ‌న్ ఈ సినిమాకు డైరెక్ట‌ర్ తో పాటు నిర్మాత‌గా కూడా ఉన్నాడు.

- Advertisement -

దీంతో ప్ర‌మోష‌న్స్ బాధ్య‌త‌లు మొత్తం ఈ హాట్ క‌పుల్స్ భుజాల‌పైనే ఉండ‌నున్నాయి. హీరోయిన్ హోదాలో ప్ర‌చారానికి రాక‌పోయినా.. నిర్మాత హోదాలో రావాల్సి ఉంటుంది. అయితే న‌య‌న్.. ఇప్పుడు కూడా త‌న పాలసీని పాటిస్తుందా.. లేదా పాలసీని బ్రేక్ చేసి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటుందా.. అనేది చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు