కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అంటే తెలియని వారుండరు. విభిన్న స్టోరీలతో సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీ, తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. “సూల్తాన్” మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ, ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. కాగ ఈ హీరో ప్రస్తుతం “సర్దార్” అనే సినిమాతో తమిళం, తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
పి. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ “సర్దార్” మూవీని ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. కాగ ఈ మూవీలో కార్తీకి జోడీగా రాశీ ఖన్నా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి ఓ పోస్టర్ రిలీజ్ కాగా, ప్రస్తుతం మరో పోస్టర్ ను హీరో కార్తీ, ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశాడు.
ఈ పోస్టర్ లో కార్తీ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. చేతిలో గోళీ సోడా పట్టుకుని సూపర్ మాస్ లుక్ తో అదరగొడుతున్నాడు. ఈ పోస్టర్ తో కార్తీ “సర్దార్” పై అంచనాలు కొంత వరకు పెరుగుతున్నాయని చెప్పవచ్చు.
Happy to reveal the second look from #Sardar. Looking forward to celebrating Diwali with this ambitious project.#SardarFromDiwali2022@Psmithran @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash #Laila @ChunkyThePanday @george_dop @AntonyLRuben @lakku76 @Prince_Pictures pic.twitter.com/QocceennS7
— Actor Karthi (@Karthi_Offl) May 24, 2022