Kanguva: సెకండ్ లుక్ తో ట్విస్ట్ రివీల్… కాన్సెప్ట్ ఇదే

Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “కంగువా”. తాజాగా ఈ సినిమా నుంచి హీరో సెకండ్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో సినిమాలోని మెయిన్ ట్విస్ట్ తో పాటు కాన్సెప్ట్ కూడా రివీల్ అయింది. మరి ఇంతకీ “కంగువా” మూవీ కాన్సెప్ట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే….

స్టార్ హీరో సూర్య సినిమా వస్తుంది అంటే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుంటారు. ఈ హీరో ఎంచుకునే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు అంత ఎఫెక్టివ్ గా ఉంటాయి మరి. అందుకే సూర్యకు కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తమిళం తర్వాత తెలుగులోనే ఆయనకు ఎక్కువగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో ఫ్యాన్స్ అంతా ఆయన నటిస్తున్న తాజా మూవీ “కంగువ” గురించి ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ సెకండ్ లుక్ ను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్ తో పాటే ట్విస్ట్ లు కూడా రివీల్ చేశారు. “కాలం కంటే విధి బలమైనది. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒక్కటే పేరు వినబడుతుంది.. కంగువ” అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసిన ఈ పోస్టర్ చూస్తే సినిమా కాన్సెప్ట్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

- Advertisement -

Kanguva: Twist reveal with second look...

ఇదొక టైం ట్రావెల్స్ సినిమా అనే కాన్సెప్ట్ ను రివీల్ చేయడంతో పాటు, ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కాలాల్లో ఈ సినిమా కథ జరుగుతుందనే విషయం ఈ పోస్టర్ తో బయటపడింది. కెఈ జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు తెలుగులో యూవీ క్రియేషన్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. తెలుగులో దరువు, శౌర్యం, శంఖం సినిమాలకు దర్శకత్వం వహించిన శివ “కంగువ” మూవీకి కూడా డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక టైం ట్రావెల్ సినిమా చేయడం సూర్యకు ఇదే మొదటిసారి కాదు.

ఇదివరకు ఆయన మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో “24” అనే టైం ట్రావెల్స్ సైన్స్ ఫిక్షన్ మూవీని చేశారు. అందుకే “కంగువ” సినిమా నుంచి రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్ ను చూస్తే “24” సినిమా గుర్తొస్తుందని అంటున్నారు. కాగా వచ్చే ఏడాది వేసవిలో ఒకేసారి పది భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సూర్య సరసన హిందీ హీరోయిన్ దిశా పటాని నటిస్తోంది. త్వరలోనే “కంగువా’ టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు