Devara Teaser: ఓవర్ చేస్తున్నారా… అట్రాక్ట్ చేస్తున్నారా?

2023లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇది నందమూరి అభిమానులకు ఒక తీరని వెలితి. అయితే, 2024లో దేవర వస్తుంది అనే ఎగ్జైట్మెంట్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ప్రస్తుతం దేవర సినిమా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నిజానికి ప్రస్తుతం దేవర నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయినా, ట్రెండింగ్‌లో ఉంది. దీనికి కారణం… కళ్యాణ్ రామ్ నటిస్తున్న డేవిల్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో కళ్యాణ్ రామ్… పలు సందర్భాల్లో దేవర గురించి చాలా హైప్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాలేని విధమైన విజువల్ వండర్‌గా దేవర ఉండబోతుందని, తారక్ లుక్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలాగే టీజర్ రెడీ అవుతుందని కూడా అన్నాడు.

అంతే కాదు, ఇదే టైంలో దేవర సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న అనిరుధ్ కూడా ఇటీవల ట్విట్టర్‌లో మూవీ టీజర్ గురించి #AllHailTheTiger అనే హ్యాష్ ట్యాగ్ తో ఓ ట్వీట్ వేశాడు. టీజర్ బాగుందని, అలాగే ఎగ్జైట్‌గా ఉంది అంటూ రాసుకొచ్చాడు.

- Advertisement -

ఈ రెండు విషయాలతో దేవర మూవీ ఒక్క సారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు టీజర్ గురించి మూవీ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ, కళ్యాణ్ రామ్ నుంచి అనిరుధ్ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో టీజర్ పై అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు. డిసెంబర్ 29న తర్వాత థియేటర్స్‌లో డేవిల్ సినిమా మధ్యలో కానీ, న్యూయర్ కానుకగా జనవరి 1న గానీ, రిలీజ్ చేయొచ్చు అని తెలుస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు