Janhvi Kapoor : గుండె పగిలింది… కానీ అతను నా చేతిని వదల్లేదు

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తాజాగా తన హార్ట్ బ్రేక్ విషయం గురించి మాట్లాడింది. గుండె పగిలింది.. కానీ అతను మాత్రం నా చేతిని వదల్లేదు అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇంతకీ జాన్వికి హార్ట్ బ్రేక్ అయ్యింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే..

సినిమాల్లోకి రాకముందే హార్ట్ బ్రేక్

హీరోయిన్ జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన రాబోయే చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ప్రమోషన్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూలలో ఒకదానిలో జాన్వి తన హృదయ విదారక అనుభవాన్ని పంచుకుంది. తన జీవితంలో ఒక్కసారే ఇలాంటి అనుభవం ఎదురైందని ఆమె అంగీకరించింది. కానీ హార్ట్‌బ్రేక్ అనేది రొమాంటిక్ మాత్రమే కాదని ఆమె వివరించింది. 2018లో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి కొన్ని నెలల ముందు జాన్వీ తన తల్లి శ్రీదేవిని కోల్పోయింది. తల్లి మరణించిన సంఘటన తన జీవితంలో హార్ట్ బ్రేకింగ్ గా అన్పించిందని జాన్వీ అన్నారు.

ఆ టైమ్ లో గుండె పగిలింది..

రణవీర్ అలహబాడియా పోడ్‌కాస్ట్‌లో జాన్వీ మాట్లాడుతూ “లవ్, రిలేషన్షిప్ లాంటి సంబంధాలలో మాత్రమే హార్ట్‌బ్రేక్ జరుగుతుందని నేను అనుకోను. అనేక ఇతర విషయాలలో కూడా కావచ్చు. మీరు ఏదో ఒకదానిపై చాలా ఆశలు పెట్టుకుని, మానసికంగా దానితో అనుబంధం పెంచుకున్నప్పుడు.. అది దూరమైనా, లేక అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. అంటే గుండె పగిలినట్లే. ఇది నా కెరీర్‌లో అనుభవించాను. నేను కూడా హార్ట్ బ్రేక్ బాధను ఫీల్ అయ్యాను. కానీ అది నా తల్లి మరణం విషయంలో జరిగింది” అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Janhvi Kapoor BREAKS Down In Tears Recalling Her Behaviour With Sridevi:  'Maine Logon Ki Bakwaas...' - News18

లవ్ లైఫ్ లో హార్ట్ బ్రేక్…

“మీరు లవ్ లైఫ్ లో హార్ట్ బ్రేక్ గురించి అడిగితే.. నేను ఆ హార్ట్‌బ్రేక్ అనుభవం నుండి బయటకు వచ్చాను. ఎందుకంటే ఆ వ్యక్తి నన్ను, నా చేతిని ఎప్పుడూ విడిచి పెట్టలేదు. ఆ హార్ట్ బ్రేక్ అంశం నుండి బయటకు రావడానికి అది నాకు సహాయపడింది. కొన్ని విషయాలు ఎందుకు జరిగాయి అనే దాని గురించి మీకు స్పష్టత ఉన్నప్పుడు అది సరైన పనే” అని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమెను తన తల్లి చననిపోయిన బాధ నుంచి బయట పడేసింది జాన్వి బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శిఖర్ పహారియాతో డేటింగ్‌

జాన్వీ శిఖర్ పహారియాతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అతనితో తనకున్న సంబంధాన్ని ఆమె స్వయంగా చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గా అంగీకరించింది. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమారుడు. ఒకానొక సందర్భంలో “నా 15-16 సంవత్సరాల వయస్సు నుండి అతను నా జీవితంలో ఉన్నాడు. మేము ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాము. మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాము” అని శిఖర్ గురించి జాన్వీ చెప్పింది. అప్పటి నుంచి వీళ్ళ రిలేషన్ గురించి వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు