Balayya Controversy : మందు తాగడం సీజీ… అంజలిని తోసేయ్యడంపై విశ్వక్, నాగవంశీ రియాక్షన్ ఇదే

Balayya Controversy : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన ఏ ఈవెంట్ కు హాజరైనా ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటారు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కాగా, ఇక్కడ కూడా హీరోయిన్ అంజలిని తోసేసి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఈ సీన్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుండగా, చిత్ర నిర్మాత నాగ వంశీ, హీరో విశ్వక్ సేన్ ఈ వివాదంపై తాజాగా స్పందించారు. మరి వీరిద్దరి రియాక్షన్ ఏంటి? అంటే..

మందు తాగడం సీజీనా?

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్, నాగ వంశీ పాల్గొన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషన్లలో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఈవెంట్లో మందు లాంటిది ఏమీ లేదని, అదంతా సీజీ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో వీడియోలో మందు బాటిల్ అంతా క్లియర్ గా కన్పిస్తుంటే సీజీ అంటాడేంటి భయ్యా అని అని అనుకుంటున్నారా? అయితే ఆ డౌట్ కు నిర్మాత నాగ వంశీ సమాధానం చెప్పారు.

హీరోయిన్ ను తొయ్యడం సంగతేంటి?

నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ముగ్గురం నలుగురం నిలబడి మాట్లాడుతున్నప్పుడు పక్కకు జరుగు అంటాము. వినకపోతే తోస్తాము. అందులో వివాదం ఏముంది? అయినా ఆ తరువాత హీరోయిన్ అంజలి, బాలయ్య సరదాగా మాట్లాడుకున్నారు. దీన్ని ఎందుకు వివాదం చేస్తున్నారు? నేను అక్కడే ఉన్నాను కదా… ఈవెంట్ లో మందు అంటూ వైరల్ చేస్తున్న వీడియోలో ఉన్నదంతా సీజీ. మేము ఆ వీడియోలను క్రియేట్ చేసిన వాళ్ళను పట్టుకున్నాము అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ వివాదం కోసం సీజీ చేసి మరీ వీడియోలను వదిలే టైమ్ ఎవరికి ఉందో చెప్తే మేము కూడా చూసి తరిస్తాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Gangs Of Godavari Event Nandamuri Balakrishna Drunk Video | Nandamuri  Balakrishna Misbehaves With Anjali At Vishwak Sen's Gangs Of Godavari Event  | Nandamuri Balakrishna Drunk At Gangs Of Godavari Event - Filmibeat

ఇదే వివాదం?

ఇక ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన బాలయ్య స్టేజ్ పై ఫోటోలు దిగుతున్న క్రమంలో అంజలిని సడన్ గా నెట్టేసి షాక్ ఇచ్చాడు. ఆయన హీరోయిన్లతో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా ఇలా చేశారు. అయితే ఊహించని ఈ పరిణామానికి తెల్లబోయిన అంజలి పక్కనే ఉన్న మరో హీరోయిన్ ను పట్టుకొని నిలదొక్కుకుంది. లేదంటే ఆమె కాస్తలో స్టేజ్ పై నుంచి పడిపోయేది. అయితే నందమూరి అభిమానులు ఆయన ఏదో సరదాగా అలా చేశాడు అని కవర్ చేసుకోవడానికి వీలు లేకుండా బాలయ్య మందు తాగి ఆ మత్తులోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టేజ్ పై ఇలాంటి పిచ్చి పని చేశాడు అంటున్నారు నెటిజన్లు. అంతేకాకుండా ఈవెంట్ లో మందు కలిపి ఉన్న బాటిల్ ను వీడియోలో చూపిస్తున్నారు. దీంతో స్టేజ్ పై బాలయ్య ఇలా విచిత్రంగా ప్రవర్తించడం ఎప్పుడు మానుకుంటారో అంటూ విసుక్కుంటున్నారు మూవీ లవర్స్.

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి మూవీ..

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు రెడీగా ఉంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం సమకూరచగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ, సాయి సౌజన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. విడుదలకు ముందు అంటే మే 28న నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా గ్రాండ్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు