Jagapathi Babu: సౌందర్య‌తో జగపతి బాబు ఎఫైర్ నడిపించాడా ?

Jagapathi Babu

టాలీవుడ్ అలనాటి అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటన, అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాష చిత్రాల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పటికీ సౌందర్య సినిమాలు వస్తే చాలు ప్రతి ఒక్కరు టీవీల ముందు అతుక్కుపోతారు. సౌందర్య ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణవార్తను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతారు.

ఇప్పటికీ సౌందర్య సినిమా వస్తే చాలు సౌందర్య నిజంగా మన మధ్య ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సౌందర్య. ఇక సౌందర్య ఎక్కువగా జగపతిబాబుతో కలిసి సినిమాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు ఎప్పుడు చెప్పని విధంగా సౌందర్య గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. సౌందర్యతో తనకు ఉన్న సంబంధం షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అంతా అనుకునేవారు. జగపతిబాబు ఎక్కువ సమయాన్ని సౌందర్యతో గడపడం, అంతేకాకుండా తన ఇంటికివెళ్లడం చేసేవాడట. ఈ విషయం అందరికీ తెలిసి వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకునేవారట.

ఈ విషయంపై తాజాగా జగపతిబాబు స్పందించారు. ఆడవారంటే తనకి ఎంతో గౌరవమని, అందులోనూ సౌందర్య అంటే ఇంకా ఎక్కువ గౌరవమని, అందుకే తన కుటుంబసభ్యులతో చాలా క్లోజ్ గా ఉండేవాడినని, తన ఇంటికి నేరుగా వెళ్లి వారితో చాలా క్లోజ్ గా మాట్లాడేవాడినని చెప్పాడు. ఇంత మాత్రానికే సంబంధం అంటగట్టారని అన్నారు. ఓ అమ్మాయితో అబ్బాయి క్లోజ్ గా ఉంటే ఇలాంటి మాటలు అంటారా అంటూ మాట్లాడారు జగపతిబాబు. అయితే ప్రతి ఒక్కరు అనుకుంటున్నట్టుగానే తనకు, సౌందర్యకు మధ్య ఎఫైర్ నిజంగానే ఉందని అన్నారు. అయితే అది అందరు అనుకుంటున్నట్టుగా తమ ఇద్దరిమధ్య ఉన్నది ఎలాంటి అక్రమ సంబంధం కాదని, స్నేహానికి సంబంధించిన సంబంధం ఉంది అని స్పష్టం చేశారు జగపతిబాబు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు