Indian 2: ఇండియన్ 2 నుండి ఫస్ట్ సాంగ్..వింటే గూస్ బంప్స్..!

Indian 2.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇండియన్ 2.. 1996లో కమలహాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం భారతీయుడు.. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా రూపుదిద్దుకుంటుంది. తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈ చిత్రం. జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది…

ఇండియన్ 2 నుంచి ఫస్ట్ సాంగ్..

Indian 2: First song from Indian 2..goose bumps after hearing it..!
Indian 2: First song from Indian 2..goose bumps after hearing it..!

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలను శరవేగంగా చేపట్టారు చిత్ర బృందం.. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.. ఈ సినిమాకి సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందించిన విషయం తెలిసిందే. ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ , కాజల్ అగర్వాల్ , ప్రియా భవాని శంకర్, ఎస్. జె. సూర్య , రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ తదితరులు బడా స్టార్స్ భాగమవ్వడం గమనార్హం . తమిళ అగ్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జైంట్ మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు..

గూస్ బంప్స్ తెప్పిస్తున్న పాట…

పారా అంటూ తమిళ్ వెర్షన్ లో విడుదల చేసిన ఈ పాట వింటుంటేనే భాషతో సంబంధం లేకుండా..చాలా అద్భుతంగా ఉంది .. ముఖ్యంగా యుద్ధరణ భూమిని తలపిస్తున్న ఈ పాటను చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించేసుకోవడం మొదలుపెట్టారు ఆడియన్స్ .. ఈ సినిమాతో భారీ విజయాన్ని.. అంటే భారతీయుడు సినిమా కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -

డైరెక్టర్ శంకర్ సినిమాలు..

డైరెక్టర్ శంకర్ విషయానికొస్తే.. మరొకవైపు రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ఇప్పటికే ఈ సినిమా కంప్లీట్ చేసి .. విడుదల చేయాల్సి ఉండగా.. శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి చేయలేకపోయారు. ఇక జూలై 12వ తేదీన ఇండియన్ 2 చిత్రాన్ని విడుదల చేసి.. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.. ఇక మరొకవైపు రామ్ చరణ్ తో ఈ సినిమాలో కియారా అద్వానీ జతకట్టనున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వినయ విధేయ రామ సినిమా రాగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.. ఒకవైపు స్టార్ డైరెక్టర్ శంకర్ మరొకవైపు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ..వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అందరి అంచనాలు పెరిగిపోయాయి .. మరి ఈ చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

 https://twitter.com/LycaProductions/status/1793243174883770542

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు