Hollywood: చాట్ జీపిటిపై బ్లాక్ విడో కేసు… వివాదం ఏంటంటే?

Hollywood : ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రోజురోజుకూ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. దీన్ని కనిపెట్టింది మనుషులే అయినప్పటికీ దానివల్ల ఇబ్బందులు పడుతోంది కూడా మనుషులే. ఇప్పటికే చాలా చోట్ల ఈ ఏఐ వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుండగా, ఈ టెక్నాలజీలు మానవాళికి సమస్యలు సృష్టిస్తూ మనుషులకు వ్యతిరేకంగా మారుతుందేమోనని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా పాపులర్ హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ ఏఐ మీద చర్యలకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన చాట్ జీపీటీ మీద కేసు వేసింది స్కార్లెట్.

ఏఐ మోసం చేసిందంటూ..

మార్వెల్ సినిమాల్లో బ్లాక్ విడోగా అవెంజర్ పాత్రను పోషించిన స్కార్లెట్ జాన్సన్ ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. లూసీ సినిమాలో 100 శాతం మెదడును ఉపయోగించి దేవుడిగా మారే పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా చాట్ జీపీటీ – ఓపెన్ ఏఐ కంపెనీ తనను మోసం చేసిందని హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ సంచలన ఆరోపణ చేశారు.

Scarlett Johansson, asegura que OpenAI clonó su voz para ChatGPT - CHIC  Magazine

- Advertisement -

వివాదం ఏంటంటే ?

ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన సామ్ ఆల్ట్‌మాన్ చాట్ GPT 4.0 సిస్టమ్ కోసం అందమైన స్త్రీ స్వరాన్ని ఎంచుకోవాలని భావించారు. అందులో భాగంగానే గత సంవత్సరం సెప్టెంబర్‌లో హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్‌ తో మాట్లాడారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఓపెన్ ఏఐలో తన వాయిస్ ను వాడేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన Sat GBD 4.0 సిస్టమ్‌కు ఇచ్చిన వాయిస్ ప్రింట్ అచ్చం అసలైన స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ లాగా ఉంది. ఇది చాలా మందిని షాక్‌కు గురి చేసింది. విషయం తెలుసుకున్న నటి ఈ విషయమై ఓపెన్ ఏఐ సంస్థపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

స్కార్లెట్ ఓపెన్ స్టేట్మెంట్

స్కార్లెట్ ఈ విషయం గురించి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం సామ్ ఆల్ట్‌మాన్ నా బృందాన్ని సంప్రదించి, దీని గురించి మాట్లాడాలి అన్నాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళు అనుమతి లేకుండా నా వాయిస్ ను ఏఐగా వాడడం వల్ల అత్యవసరంగా లాయర్‌ని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో డీప్‌ఫేక్‌తో సహా చాలా హింసను అనుభవిస్తున్నాము. కానీ ఇప్పుడు వ్యక్తిగత హక్కులను పరిరక్షించుకోవడానికి రెడీగా ఉన్నాము” అంటూ సుదీర్ఘ పోస్ట్‌ను విడుదల చేసింది స్కార్లెట్. దీంతో ఆమె స్టేట్మెంట్ ను చూసి చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీలు స్కార్లెట్ కు సపోర్ట్ చేస్తున్నారు.

డీప్ ఫేక్ బాధితులు

కొన్ని రోజుల కిందట నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన ముఖాన్ని మరొక హాట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమేజ్‌తో ఎడిట్ చేయడం చూసి షాక్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా దీని గురించి ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యింది. అమితాబ్ బచ్చన్ సహాయ పలువురు ప్రముఖులు దీనికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఏఐ అభివృద్ధి కారణంగా చాలా డీప్‌ఫేక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ డీప్ ఫేక్ బారిన పడ్డావాళ్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు