Anirudh Ravichandran: అనిరుధ్ అడుగుజాడల్లో..

18 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ సినిమాలోనే ‘కొలవెరి’ పాటతో వెర్రెత్తించిన అనిరుధ్.. చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. విజయ్, రజనీకాంత్, అజిత్.. ఇలా చాలామంది సూపర్ స్టార్ల సినిమాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు తమిళంలో అతనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అతిశయోక్తి లేదు.

కేవలం సినిమాలతోనే కాక మ్యూజికల్ కన్సర్ట్‌లతో యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అనిరుధ్. అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో అనిరుధ్ తెలుగు వాళ్లకు కూడా బాగానే పరిచయం.
అజ్ఞాతవాసి డిజాస్టర్ తరువాత అనిరుధ్ జెర్సీ సినిమాకి ఇచ్చిన బాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఒక స్థాయిలో నిలబెట్టింది.
జెర్సీ తో అనిరుధ్ కు మంచి పేరు రాగానే , ట్విట్టర్ వేదికగా నా పని అయిపోయింది అనుకున్నార్రా.? అనే పేట సినిమాలోని రజినీకాంత్ పిక్ ను షేర్ చేసాడు అనిరుధ్.

ఇప్పుడు అనిరుధ్ బాటలోనే థమన్ అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం థమన్ కంపోస్ చేస్తున్న సాంగ్స్ మిళియన్స్ లో దూసుకెళ్తున్న, థమన్ కి ట్రోల్స్ మాత్రం తప్పడం లేదు. థమన్ నుంచి ఒక కొత్త సాంగ్ రాగానే ఎక్కడ నుంచి లేపాడో రిఫరెన్స్ పెట్టిమరీ ప్రస్తుతం ట్రోల్ చేస్తారు. ఏది ఏమైనా అనిరుధ్ కొత్త ట్యూన్స్ కనిపెట్టడంలో టాలెంట్ చూపిస్తే , థమన్ పాత ట్యూన్స్ ఎత్తుకురావడంలో టాలెంట్ చూపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు