శివ కార్తికేయన్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కోలీవుడ్ లో చిన్న హీరోగా కెరీర్ ప్రారంభించిన శివ కార్తికేయన్, కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెమో, సీమ రాజా, శక్తి, వరుణ్ డాక్టర్ సినిమాలను తెలుగులో డబ్ చేసి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు శివకార్తికేయన్. వీటి తర్వాత తన సినిమాలను తమిళం తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా వచ్చిన డాన్ మూవీ కూడా తెలుగులో ఊహించిన ఫలితాలను అందిస్తుంది.
శివ కార్తికేయన్ ప్రస్తుతం జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో పూర్తి తెలుగు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు తన 21వ మూవీని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకు రాజ్ కమల్ ఫిల్మ్స్ తో కమల్ హాసన్ నిర్మిస్తుండగా, హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాకు “మావీరన్” అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. ఈ సినిమాలో శివకార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీం, వచ్చే ఏడాది చివర్లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.