Ileana: భయంకరమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఇలియానా..ఆందోళనలో ఫాన్స్..!

గోవా బ్యూటీ ఇలియానా తన అద్భుతమైన నటనతో అంతకుమించిన అందంతో అటు బాలీవుడ్ ఆడియన్స్ ను.. ఇటు సౌత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే ..ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీని తన సినిమాలతో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా స్టార్ హీరోలతో జతకట్టి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక సౌత్లో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో బాలీవుడ్ కి మకాం మార్చిన ఇలియానా.. అక్కడే సెటిల్ అయ్యింది.. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె.. ఇటీవలే పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. ప్రకటించిన ఆరు నెలలకే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కానీ పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.. దీంతో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. ఎట్టకేలకు తనకు పుట్టిన కొడుకుకి తండ్రి ఎవరో వెల్లడించింది. ఇక ఇలా పెళ్లి కాకముందే గర్భం దాల్చి బిడ్డ పుట్టిన తర్వాత భర్తను చూపించిన అప్పట్లో భారీగా వైరల్ అయిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇలియానా..
తాజాగా తనకు ఒక అరుదైన వ్యాధి వచ్చింది అని తెలిపి అందరిని ఆశ్చర్యపరిచింది.. తనకు కొడుకు పుట్టాకే ఇలాంటి వ్యాధి వచ్చింది అని చెప్పింది.. మరి ఇలియానా ఏ వ్యాధితో బాధపడుతుందో ఇప్పుడు చూద్దాం..ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తమకున్న వ్యాధుల గురించి చెబుతూ..బయట పడుతున్నారు. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న వారు తమకు వచ్చిన వ్యాధుల గురించి చెప్పి అభిమానులను బాధపెడుతున్నారు. ఈ క్రమంలోనే సమంతతో పాటు కల్పిక గణేష్ , పూనమ్ కౌర్ , దగ్గుబాటి రానా తదితరులు తమ వ్యాధులను అభిమానులకు చెప్పుకోగా.. తాజాగా ఇలియానా కూడా తాను అలాంటి సమస్యతో బాధపడుతున్నానని చెప్పి అభిమానులను బాధ పెట్టింది.

నిద్రలేమి..
కొడుకుని చూసుకోవడం కోసం ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను తాను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.. దాంతో ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కూడా తెలిపింది. అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ పెడుతున్నానని.. అదే సమయంలో తన కొడుకును కూడా దగ్గరుండి మరీ చూసుకుంటున్నానని తెలిపింది ఇలియానా.. మొత్తానికైతే తాను నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఇలియానా సినిమా జీవితం..
ఒకప్పుడు వరుస సినిమాలో చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఇలియానా.. తెలుగులో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించింది..ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలు చేయకుండా వెబ్ సిరీస్ లకే తన నటన కెరియర్ ని పరిమితం చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే సినిమాల చేయకుండా వెబ్ సిరీస్ లు చేస్తూ కెరియర్ని కొనసాగిస్తున్న ఈమె వీటి ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు