Nani : నాని ఎంతమంది హీరోలకు ఫ్యాన్ ?

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ‘ప్రాజెక్టు కె’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీని కోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ కొత్త ఆఫీస్ ను తీసుకున్నారు నిర్మాత అశ్వినీదత్. దీని ప్రారంభోత్సవానికి అమితాబ్ బచ్చన్, ప్రభాస్, నాగ్ అశ్విన్, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ నీల్, హీరో నాని, కె.రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను అమితాబ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే నాని మాత్రం కేవలం తాను అమితాబ్ తో తీసుకున్న ఫోటోలు మాత్రమే షేర్ చేసి, ఫాన్ బాయ్ మూమెంట్ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

ఇది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్ కు అలాగే మిగిలిన హీరోల అభిమానుల కంట పడింది. కోపం తెప్పించింది. నాని ఏ పెద్ద స్టార్ దగ్గరకు వెళ్లినా, తన అభిమాన హీరో అని అంటుంటాడు. గతంలో చిరు అభిమానిని అని, ఒకసారి, రజినీకాంత్ అభిమానిని అని మరోసారి, అలాగే వెంకటేష్ అభిమానిని, కమల్ హాసన్ అభిమానిని అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా అమితాబ్ అభిమానిని అంటున్నాడు. అందుకే అసలు ‘నాని ఏ హీరోకి అభిమాని?’ అంటూ అతని పై సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు