HBD Karthi: కార్తీ సినిమాల టైటిల్స్ అన్నీ కాపీనే… ఇన్ని తెలుగు మూవీస్ టైటిల్స్ వాడుకున్నాడా?

HBD Karthi: తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఆయన 25 సినిమాల్లో నటించగా, అందులో చాలా వరకు సినిమాల టైటిల్స్ అన్ని కాపీనే. ఎక్కువగా తెలుగు సినిమాల టైటిల్స్ నే పెట్టుకున్నాడు కార్తీ. స్టార్ హీరో సూర్య తమ్ముడిగా యుగానికి ఒక్కడు అనే సినిమాతో తెలుగు తరపు పరిచయమైన కార్తీ తన సినిమాలతో టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈరోజు కార్తీ పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన తెలుగు సినిమా టైటిల్స్ తో చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

సర్దార్

సర్దార్ మూవీలో కార్తీక్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాలో రాశి కన్నా, రాజీశా విజయన్ హీరోయిన్లుగా కనిపించారు. అయితే సర్దార్ అనే టైటిల్ వినగానే తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమానే గుర్తుకొస్తుంది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

Sulthan Movie Review & Rating {2.5/5}

- Advertisement -

సుల్తాన్

2021 లో వచ్చిన కార్తీ సుల్తాన్ మూవీకి బాలయ్య టైటిల్ ను వాడుకున్నాడు. 1999 లోనే బాలయ్య కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణ నటించిన మల్టీస్టారర్ మూవీ సుల్తాన్.

చినబాబు

2018లో కార్తీ హీరోగా వచ్చిన మూవీ చినబాబు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, అమల కలిసి నటించిన తెలుగు మూవీ టైటిల్ కూడా చినబాబునే. ఈ మూవీ 1988లో రిలీజ్ కాగా, కార్తీ మూవీ లేటెస్ట్ గా వచ్చింది. కాబట్టి నాగార్జున మూవీ నుంచి చినబాబు టైటిల్ ను కార్తీ స్ఫూర్తిగా తీసుకున్నట్టే. దీన్ని రైతుల గొప్పదనంతో పాటు కుటుంబ బంధాల విలువలతో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తీసుకొచ్చారు.

Kaashmora movie: audience review

కాష్మోరా

1986లో నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన కాష్మోరా అనే మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో భానుప్రియ, రాజశేఖర్ ప్రధాన పాత్రులు పోషించారు. హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదే టైటిల్ తో కార్తీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మూవీ కూడా హారర్ థ్రిల్లర్ జానర్ లోనే వచ్చింది. కాకపోతే హిట్ కాలేదు.

దొంగ

తమిళంలో తంబి అనే పేరుతో వచ్చిన ఈ మూవీని తెలుగులో దొంగ పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో జ్యోతిక కీలక పాత్రను పోషించింది. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీస్ లో దొంగ కూడా ఒకటి అని చెప్పొచ్చు.

Karthi's Khaidi witnesses extraordinary jump

ఖైదీ

కార్తీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ అనగానే గుర్తొచ్చే మూవీ ఖైదీ. ఈ మూవీ తోనే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన సినీమాటికి యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఖైదీ మూవీ 1983లో రిలీజ్ అయ్యి ఆయన కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా మిగిలిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు