HBD Allu Aravind: అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ వెనుక ఇంత కథ ఉందా..?

HBD Allu Aravind: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లుఅరవింద్ పుట్టినరోజు నేడు.. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈయన సినిమాలు నిర్మించాలన్న కలను నెరవేర్చుకోవడంతోపాటు భారీ ప్రాజెక్టు చిత్రాలను కూడా నిర్మించారు. 1949 జనవరి 10వ తేదీన అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు అల్లు అరవింద్ జన్మించారు. ఇక అల్లు అరవింద్ కు ముగ్గురు కుమారులు కాగా అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ , అల్లు శిరీష్ .. ఇక అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమాలు చేస్తూ హీరోలుగా సెటిల్ కాగా.. అల్లు వెంకటేష్ మాత్రం బిజినెస్ మాన్ గా స్థిరపడినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈరోజు ఈయన పుట్టినరోజు కావడంతో ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అల్లు అరవింద్ స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్ కి ఆ పేరు ఎందుకు పెట్టారు అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నప్పుడు దానికి తమ కుటుంబ సభ్యుల పేర్లు లేదా తమ పేరు మీద బిజినెస్ మొదలు పెడుతూ ఉంటారు చాలామంది.. అయితే ఇక్కడ అల్లు అరవింద్ మాత్రం తన కుటుంబంలో గీత అన్న పేరుతో ఎవరూ లేరు.. మరి ఈ పేరు పెట్టడం వెనుక అసలు విషయం ఏమిటి? అనే విషయానికి వస్తే.. అల్లు అరవింద్ ను ప్రేరేపించిన హిందూ తాత్విక గ్రంథమైన భగవద్గీత పేరు మీద తన నిర్మాణ సంస్థకు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు సమాచారం..

ఇక ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. అల్లు అరవింద్ ఈ నిర్మాణ సంస్థను స్థాపించి.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంట్రోతు భార్య అన్న సినిమాను నిర్మించి.. నిర్మాతగా కెరియర్ మొదలుపెట్టారు. ఇక చాలా సంవత్సరాలుగా ఎన్నో సినిమాలను నిర్మించిన ఈయన పవన్ కళ్యాణ్ 2008లో నటించిన జల్సా సినిమాతో భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈయన బ్యానర్ ద్వారానే చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ .. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో మగధీర సినిమా తీసి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ సినిమాలని కూడా నిర్మిస్తున్నారు అల్లు అరవింద్.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు