Aham Brahmasmi : ‘అహం బ్ర‌హ్మ‌స్మి’ ఆగిపోయిందా?

2017 వ సంవత్సరంలో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం తర్వాత మంచు మనోజ్ నుండీ మరో సినిమా రాలేదు. ‘ఇది నా లవ్ స్టోరీ’ ‘ఆపరేషన్ 2019’ సినిమాల్లో చిన్న చిన్న కేమియో లు ఇచ్చారు కానీ అవి ఎప్పుడో రూపొందిన సినిమాలు. హీరోగా అయితే మనోజ్ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. అతని పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యింది. దాంతో సినిమాల పై అతనికి ఆసక్తి తగ్గిపోయిందని కామెంట్స్ వినిపించాయి. కానీ ‘ఇక నుండి వరుసగా సినిమాల్లో నటిస్తా’ అని మనోజ్ అభిమానులకి హామీ ఇచ్చారు. లాక్ డౌన్ కు ముందు ‘అహం బ్ర‌హ్మ‌స్మి’ అనే పాన్ ఇండియా మూవీని ప్రారంభించాడు.

ఇలా ఆ సినిమా స్టార్ట్ అయ్యిందో లేదో కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చింది. దీంతో షూటింగ్ ఆగిపోయింది. ఇలా ఆగిపోయిన సినిమాల షూటింగ్స్ అన్నీ ప్రారంభమై, విడుదలవుతున్నాయి. కానీ, ‘అహం బ్ర‌హ్మ‌స్మి’ షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అని అంతా ఫిక్సయిపోయారు. అయితే, అందులో నిజం లేదు అన్నది తాజా సమాచారం. లాక్ డౌన్ టైం లో మనోజ్ బరువు పెరిగాడు. కానీ సినిమా కోసం అతను వెయిట్ తగ్గాల్సి ఉంది. ఇప్పుడు సన్నబడడం కోసం వర్కౌట్లు మొదలుపెట్టాడట మనోజ్. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు