Harom Hara Trailer : తుపాకులతో ‘హరోం హర’ మారణ హోమం

హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ సుధీర్ బాబుకి పెద్దగా సక్సెస్ రాలేదు. సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ “హరోం హర”. జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి సుమంత్ జి. నాయుడు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. జూన్ 14వ తేదీన సుధీర్ బాబు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు.

HAROMHARA Official Trailer

ఆ ట్రైలర్ వివరాల్లోకి వెళితే…. ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో సాగేటువంటి కథ. సుధీర్ బాబు ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే నిరుద్యోగి యువకుడి పాత్రను పోషిస్తున్నారు. ఆయన చిత్తూరు జిల్లాలోని కుప్పం గ్రామంలో నివసిస్తాడు. నిరుద్యోగం కారణంగా తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకోలేక…. తన స్నేహితుడు సునీల్ సలహాతో తుపాకీ తయారీలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి అతని జీవితాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తాడు.

- Advertisement -

ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది. అతని తుపాకీ వ్యాపారం పెద్ద స్థాయికి చేరుకుంటుంది. కానీ ఈ స్థాయికి అనుకున్న విధంగా శత్రువులు కూడా పెరుగుతారు. పోలీసుల గుప్తాచార్యం కూడా ఉంటుందనేది కథ సారాంశం. ఇక ఈ సినిమా ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు