క్రిష్ జాగర్లమూడి
సినిమా సినిమా కు తన పంథా మార్చుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ను ఏర్పరచుకున్నాడు.
ఎన్టీఆర్ బయోపిక్ మినహాయిస్తే ఇప్పటికివరకు చేసిన ప్రతి సినిమా మంచి పేరును తీసుకుని వచ్చింది.
గమ్యం సినిమాతో మొదలైన క్రిష్ ప్రయాణం పవన్ కళ్యాణ్ తో సినిమాని చేసే రేంజ్ కు ఎదిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “హరిహర వీరమల్లు”.ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడంతో పవన్ తన షూటింగ్‌లను పక్కన పెట్టేసాడు. క్రిష్ సినిమాకి మళ్ళీ బ్రేక్స్ పడ్డాయి అనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రామోజీ ఫిల్మ్ సిటీలో హరి హర వీర మల్లు షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
Read More: Directors Day: దాసరి – లెజెండ్ ఫర్ ఏ రీజన్…!
హరిహర వీరమల్లు చిత్ర బృందం ఔరంగజేబ్ కాలం నాటి గుర్రాలు మరియు సైనికులను ఉపయోగించి హై-ఎండ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడం ప్రారంభించారు. వీర మల్లు తన తెలివైన వ్యూహాలతో బంగారు నిధిని కొల్లగొడుతూ ఔరంగజేబు జైలు నుండి తప్పించుకునే సమయంలో ఈ సీక్వెన్స్ సినిమా ఇంటర్వెల్ పార్ట్‌లో వస్తుంది. పవన్ చాలా స్టంట్‌లు స్వయంగా చేస్తున్నాడని తెలుస్తుంది. అంతకుముందు క్రిష్ పవన్‌ని పోలి ఉండే స్టంట్‌మ్యాన్‌ని ఉపయోగించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడు.
అనుకున్న ప్రకారం 2023 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి వీలుగా త్వరలో సినిమాను పూర్తి చేస్తామని దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏఎమ్ రత్నంకి చెప్పినట్లు తెలుస్తోంది. 2023 వేసవిలో HHVM బయటకు రాగలిగితే, అది ఖచ్చితంగా అభిమానులకు పెద్ద పండగ అని చెప్పొచ్చు.
Read More: #WaltairVeerayya: మాస్ పార్టీ ఫిక్స్
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...