Andrea Jeremiah : నా టీ షర్ట్ లో చెయ్యి వేసాడు…ఆండ్రియా సంచలనం

తమిళ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా గురించి తెలియని వారు ఉండరు. ఆండ్రియా జెర్మియా తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇటీవల వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీలో కీలకపాత్ర పోషించింది.

ఆండ్రియా కెరీర్
ఆండ్రియా జెర్మియా ఈ అమ్మడు సింగర్,గా నటిగా తన ప్రతిభను చాటుకుంటుంది. కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాతో ఆండ్రియా జెర్మియాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతో ఆకట్టుకుంది. 2005లో తమిళ సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆండ్రియా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించి పాటలు కూడా పాడింది తమిళ బ్యూటీ. తమిళంతో పాటు తెలుగులో కూడా పదుల సంఖ్యలో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించింది ఆండ్రియా. బొమ్మరిల్లుతో మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో హిట్ సాంగ్స్ ను ఆలపించింది బ్యూటీ. కాగా ఆమె ఎక్కువగా తమిళ పరిశ్రమకే పరిమితం అయింది.

ఆండ్రియా జెర్మియాకు వేధింపులు
తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది “అప్పట్లో నా వయసు 11 సంవత్సరాలు. నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో నేను జీన్స్, టీ షర్ట్ మాత్రమే ధరించాను. మా నాన్న కూర్చున్న సీటుకు కొంచెం దగ్గర్లోనే నేను కూర్చున్నాను. అప్పుడు ఎవరో లోపల చేయి వేసినట్లు అనిపించింది. నా షర్టులో ఎవరు చేయి పెట్టారన్న ఊహని తట్టుకోలేకపోయాను. ఇక వెంటనే భయపడిపోయాను. ఎవరితో ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడానికి కారణం ఏమిటో అర్థం కాక అప్పుడే ఏడుపు మొదలు పెట్టాను” అని ఆండ్రియా చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు