Hanu RaghavaPudi: అందుకే అసురన్ చేయలేదు

దర్శకుడు హను రాఘవపూడి రీసెంట్ గా వచ్చిన సీతా రామం సినిమా సక్సెస్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.

తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ యొక్క తెలుగు రీమేక్‌కు హను దర్శకత్వం వహించాల్సి ఉందని చాలా మందికి తెలియదు. మొదట నిర్మాతలు హనుతో చర్చలు జరిపారు కానీ అతను ఆఫర్‌ను తిరస్కరించాడు. చివరికి అది శ్రీకాంత్ అడ్డాల వద్దకు వెళ్లి నారప్ప లా మారింది.

ఆ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో ఇటీవల హను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో హను మాట్లాడుతూ.. దర్శకుడు వెట్రిమారన్‌కి తాను వీరాభిమానినని. “తన సినిమా ఎప్పుడు విడుదలైన, దానిని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి నేను చెన్నైకి వెళ్తాను” అని హను చెప్పాడు.అసురన్ రీమేక్ అవకాశం వచ్చినప్పుడు సీతా రామం పనుల్లో ఉండటం వలన, దానిని చెయ్యలేకపోయినట్లు తెలిపాడు హను.

- Advertisement -

వెట్రిమారన్‌ సినిమాని ఏదోకటి తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాను. “అతని సినిమాలు ఒరిజినల్ లాంగ్వేజ్‌లో ఉన్నట్లే హార్డ్ హిట్టింగ్‌ గా రీమేక్ చేయాలని నేను ఆశిస్తున్నాను” కనీసం నన్ను నేను పరీక్షించుకోవడానికి వెట్రిమారన్ సినిమా ఏదైన అవకాశం వస్తే రీమేక్ చేస్తానని చెప్పుకొచ్చాడు హను.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు