GodFather: సత్యదేవ్ క్యారెక్టర్ ఇదే!

ఆచార్య పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోలాశంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మలయాళం లో వచ్చిన లూసీఫర్ కు తెలుగు రీమేక్ అని తెలిసిందే. గాడ్ ఫాదర్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.

దీనికోసం ప్రమోషన్లను భారీగా చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లు విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకులపై పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా నుంచి ఆయా పాత్రల ప్రాధాన్యతను బట్టి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదులుతూ వెళుతున్నారు. రీసెంట్ గా ‘సత్యప్రియ’ గా నయనతార పాత్రను పరిచయం చేస్తూ ఆమె లుక్ ను రిలీజ్ చేశారు.

ఇక ఇప్పుడు సత్యదేవ్ పోషించిన ‘జైదేవ్’ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సత్యదేవ్ డీసెంట్ లుక్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా చిరు హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు