GodFather First Look : ఇంపాక్ట్ మొత్తం పోయింది !

తెలుగులో హనుమాన్ జంక్షన్ అనే సినిమాను తెరకెక్కించిన మోహన్ రాజా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ, ప్రస్తుతం మోహన్ రాజా మెగా ప్రాజెక్ట్ ను తెరకెక్కించి అందరికి సూపరిచితుడు అయ్యాడు. మెగా స్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ మూవీ. రాంచరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరి లు కలిసి నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. పోలీసులు, చుట్టూ పార్టీ కార్యకర్తలు ఉన్న ఏరియాలో ఓ బ్లాక్ కార్ వచ్చి ఆగడం, అందులో నుండి బ్లాక్ డ్రెస్ లో చిరు ఎంట్రీ. ఆ తర్వాత స్టైల్ గా నడుచుకుంటూ లోపలికి వెళ్లడం. ఇలా ఉంది ఈ వీడియో. నిజానికి ఈ లుక్ చాలా చప్పగా ఉంది. మలయాళంలో మోహన్ లాల్ వైట్ పంచ, వైట్ షర్ట్ వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే తెలుగు ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. చిరు కూడా అలాంటి గెటప్ లోనే కనిపిస్తారు అని మెగా అభిమానులు ఆశించారు. కానీ ఈ ఫస్ట్ లుక్ వారిని పూర్తిగా నిరాశ పరిచే విధంగా ఉంది అని చెప్పాలి. ఫస్ట్ లుక్ పోస్టరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ మెగా అభిమానుల్లో మొదలైంది. అయితే తమన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఈ ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు