God Father Trailer : మాస్ కే ప్రాధాన్యత

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమ కొత్త పుంతాలను తొక్కుతుంది. కొత్త కథలు, కథనాలతో దర్శకులు, హీరోలు తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, సీతారామం, కార్తికేయ2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల దెబ్బకు కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలు కూడా టాలీవుడ్ దర్శకులను అనుసరిస్తూ.. కొత్త రకం స్టోరీలతో సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. ఇంకా పాత కాలం పద్దతిలోనే సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టార్ గా మారింది. దీనికి కారణాలు కో కొల్లలు. దీని తర్వాత వచ్చే సినిమాకు అయినా.. చిరు తన స్టైల్ ను మారుస్తాడా అని అనుకుంటే.. అది జరగలేదని చెప్పొచ్చు. మెగాస్టార్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా గాడ్ ఫాదర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తే.. చిరు.. ఇంకా పాత కాలం సినిమాలనే ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది. లూసిఫర్.. పొలిటికల్ డ్రామాగా సాగుతుంది. ఆధ్యాంతం ఆసక్తిగా ఉంటుంది. గాడ్ ఫాదర్ ట్రైలర్ ను చూస్తే..పొలిటికల్ యాక్షన్ సినిమాలా ఉంది. ట్రైలర్ మొత్తం చిరంజీవి గత సినిమాల్లా.. మాస్, యాక్షన్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నా.. తీసుకోలేరు. ఒరిజినల్ కంటే భిన్నంగా ట్రై చేసి.. యాక్షన్ సన్నివేశాలను జొప్పించి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా ఆసక్తికరమైన డ్రామాతో తెరకెక్కిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక ట్రైలర్ నిండా మాస్, యాక్షన్ సీన్స్ ఉండటం వల్ల ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. కానీ, ఇది పాన్ ఇండియా సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల మద్దతు అవసరం.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ట్రైలర్ లో పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది. థమన్ మార్క్ మ్యాజిక్ ఇందులో అంతగా లేదు అని చెప్పొచ్చు. నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ లు కనిపించినా.. వీరి పాత్రల నిడివి కాస్త తక్కువే అన్నట్లు తెలుస్తుంది. సినిమా మొత్తం మెగాస్టార్ వన్ మాన్ షో ఉంటుందని ట్రైలర్ తో అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు