Bimbisara : కీరవాణి భయం ?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం గా రూపొందింది ‘బింబిసార’. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అయింది. మంచి హైప్ ను క్రియేట్ చేసింది. అంతే కాకుండా, యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ ని కొల్లగొట్టింది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోపక్క ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. దిల్ రాజు నైజాం హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. ఆంధ్ర నుండి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి అని సమాచారం.

అంతా బాగానే ఉంది కానీ ‘బింబిసార’ ని ఓ నెగిటివ్ సెంటిమెంట్ భయపెడుతుంది. అదేంటి అంటే, ఈ చిత్రానికి కీరవాణి కూడా పనిచేయడం. కీరవాణి ఈ మధ్య కాలంలో రాజమౌళి తో చేసిన సినిమాలు మినహా, బయట ఏ దర్శకుడితో పని చేసినా, అది ప్లాప్ అవుతూ వస్తోంది. ‘సవ్య సాచి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘కొండపొలం’ ‘జయమ్మ పంచాయితీ’ ఇలా అన్ని సినిమాలు నిరాశపరిచాయి. అయితే బింబిసాకు కీరవాణి కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే సమకూరుస్తున్నాడు. దీంతో రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు