Double Ismart: డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఇదే హైలెట్ కానుంది

Double Ismart: బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక్కడితో పూరి జగన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ దర్శకుడుగా సెటిల్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత బాచి అనే సినిమాను తెరకెక్కించాడు పూరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అయితే పూరి ప్రత్యేకత ఏంటంటే హీరో క్యారెక్టర్ ను చాలా బాగా రాస్తాడు. కేవలం క్యారెక్టర్ తోని ఆ సినిమాను నడిపించగల సామర్థ్యం ఉన్న ఏకైక డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

అందరి స్టార్ హీరోలతో సినిమాలు

పూరి జగన్నాథ్ చాలామంది స్టార్ హీరోలతో పనిచేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి బిజినెస్ మాన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు. ప్రభాస్ తో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్. అల్లు అర్జున్ తో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో. ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా టెంపర్. ఇలా దాదాపు అందరి స్టార్ హీరోలతో వర్క్ చేశాడు పూరి జగన్నాథ్. అయితే టెంపర్ సినిమా తర్వాత పూరికి సరైన హిట్ సినిమా పడలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అంతంత మాత్రమే ఆడాయి అని చెప్పొచ్చు.

Vijay Deverakonda

- Advertisement -

లైగర్ తో పాతాళానికి

టెంపర్ తర్వాత వరుస ఫెయిల్యూర్ సినిమాలు వచ్చిన పూరి జగన్నాథ్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా కొంత ఉపశమనం కలిగించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించింది. దాదాపు పూరి జగన్నాథ్ పని అయిపోయింది అనుకునే తరుణంలో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. పూరిని పాతాళంలోకి తొక్కేసింది.

ఈ సినిమా పూరికి కీలకం

అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇష్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి మణిశర్మ సంగీత అందిస్తున్నారు. రామ్ సరసన కావ్య ఈ సినిమాలో నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా హైలెట్స్ ఉన్నాయని తెలుస్తుంది. వీటిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అని కథనాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా హిట్ అవ్వడం అనేది పూరి జగన్నాథ్ కి కీలకమని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు