‘సొంతం’ చిత్రంతో నటుడిగా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ ‘పంజా’ చిత్రంతోనే పాపులర్ అయ్యాడు అడివి శేష్. ఈ చిత్రం కథ మొత్తం టర్న్ అయ్యేది ఇతని పాత్ర వల్లనే. ఆ తర్వాత పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ ప్లే చేస్తూ వచ్చినా ఇతను ‘క్షణం’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ మూవీ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘గూఢచారి’ చేస్తే అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ‘ఎవరు’ మూవీ అయితే అడివి శేష్ హీరోగానే కరెక్ట్ అని డిసైడ్ చేసేసింది. థ్రిల్లర్ మూవీస్ ను ప్రేక్షకులకు అందించడంలో, అది కూడా అతి తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఔట్పుట్ అందించడం ఇతనికే చెల్లింది.
ఇతను హీరోగా నటిస్తున్న సందీప్ ఉన్నికృష్ణన్ మూవీ బయోపిక్ ‘మేజర్’ చిత్రం జూన్ 3న విడుదల కాబోతుంది. మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడంతో ఈ చిత్రాన్ని బాగా మార్కెట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ లా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు ట్రేడ్ పండితులు ధీమాగా చెబుతున్నారు. అలా జరిగితే అడివి శేష్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.