Tollywood: బలగం చిత్రానికి ముందు పెట్టిన టైటిల్స్ ఏంటో తెలుసా ?

బలగం.. ఇటీవల తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. చిన్న సినిమా, తక్కువ బడ్జెట్ తో వచ్చిన బలగం చిత్రం.. ప్రేక్షకుల కళ్ల నుంచి నీళ్లు తెప్పించాయి. కాకి ముట్టుడు అనే పల్లెటూరి నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గ్రామంలో బలగం సినిమాను ప్రత్యేక ప్రదర్శనలు వేసి మరీ చూస్తున్నారు. సినిమాలో నటీనటుల యాక్టింగ్.. ఎమోషనల్ సీన్స్ పుష్కలంగా ఉండటంతో అందరికీ బాగా రీచ్ అయింది. అలాగే బలగం అనే టైటిల్ కూడా చాలా బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది.

అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ముందుగా బలగం టైటిల్ పెట్టలేదట. దీనికి ముందు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉండేవట. పెద్ధోళ్లు.. తాత మరణం.. అనే టైటిల్స్ ను నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు పరిశీలించారట. కానీ, చివరికి బలగం అని ఫిక్స్ చేశారని సమాచారం. ఒక వేళ ఈ చిత్రానికి బలగం అని కాకుండా, వేరే టైటిల్ పెట్టి ఉంటే, ఇంతలా ఆదరణ వచ్చేది కాదు అని చెప్పొచ్చు. బలగం అనే పదాన్ని, తెలంగాణ పల్లెల్లో ఎక్కువగా వాడుతారు. అందుకే సినిమా చూడకున్నా టైటిల్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది.

కాగా తక్కువ బడ్జెట్ వచ్చిన ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 1.15 కోట్లే అయింది. అంటే బ్రేక్ ఈవెన్ 1.30 కోట్లు. ఈ బ్రేక్ ఈవెన్ అతి తక్కువ కాలంలోనే అందుకుని, రికార్డ్ స్థాయిలో లాభాలను తీసుకువచ్చింది ఈ చిత్రం. బలగం చిత్రానికి కలెక్షన్లు 25 కోట్ల వరకు గ్రాస్, 13 కోట్ల వరకు షేర్ వచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు