Aishwarya Rajesh: ఆ దర్శకుడికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..!

Aishwarya Rajesh

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే 50కి పైగా సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. ఎక్కువగా ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనే నటిస్తూ ఉంటుంది. గడిచిన కొన్నేళ్ల వరకు వరుసగా తెలుగులో సినిమాలలో నటించి ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలతో బిజీగా ఉంది. 2018లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.

అంతకుముందు చైల్డ్ యాక్టర్ గా కూడా పలు సినిమాలలో నటించింది ఐశ్వర్య రాజేష్. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్.. సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్.. నానితో టక్ జగదీష్ తదితర హీరోలతో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది ఐశ్వర్య రాజేష్.. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ఈమె.. ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాల పైనే ఫోకస్ చేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే ఈ మధ్య ఐశ్వర్య రాజేష్ పై ఒక దర్శకుడు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళ దర్శకులలో ఒకరైన వీర పాండియన్ ఐశ్వర్య రాజేష్ పైన చేసిన కామెంట్స్ లలో.. ఐశ్వర్య రాజేష్ ని తానే పరిచయం చేశానని.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయి ఫోజులు కొడుతోంది అంటూ కామెంట్స్ చేశారు.. అలా తాను డైరెక్షన్ చేసిన సినిమాలతోనే ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా పరిచయమైందని ఆ విషయం ఆమె ఎక్కడా కూడా చెప్పలేదని ఇప్పుడు స్టార్ హోదా రావడంతో తనతో సినిమా చేయడానికి పెద్దగా ఇష్టపడలేదంటూ.. ఒకప్పుడు ఆటోకి కూడా డబ్బులు లేకపోతే తానే ఇచ్చానంటూ తెలియజేశారు.

- Advertisement -

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ ఆయన పేరు ఎత్తకుండా దిమ్మ తిరిగిలా సమాధానాన్ని ఇచ్చింది. చాలామంది ఒకవైపే విని మాట్లాడుతూ ఉంటారు.. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలో అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడితే బాగుంటుందంటూ సమాధానం ఇచ్చింది ఐశ్వర్య రాజేష్.. అయితే ఈ విషయం విన్న ఐశ్వర్య రాజేష్ అభిమానులు ఇవి డైరెక్ట్ గా వీరపాండియన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిందని తెలియజేస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్వీట్ అయితే వైరల్ గా మారుతోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు