Leo 2: లియో 2 పై డైరెక్టర్ క్లారిటీ.. వచ్చేది అప్పుడే..!

Leo 2: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లియో.. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మోస్తారు విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించింది. ఈ సినిమా విడుదలైన సమయంలో కాస్త మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ దసరా సెలవులు కావడంతో భారీ స్థాయిలోనే కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా అటు డైరెక్టర్ కి ఇటు హీరోకే కాదు ఇందులో నటించిన పలువురు నటీనటులకు కూడా భారీ పాపులారిటీ లభించిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి అప్పట్లో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. లియో కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్.. ఫేక్ అని.. అసలు కథ వేరే ఉండవచ్చని స్వయంగా చిత్ర బృందం చెప్పడంతో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అందరూ తమ సందేహాలను వ్యక్తం చేశారు. అంతేకాదు ఒకవేళ ఉన్నా కూడా లియో ఒరిజినల్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ సందేహాలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు లియో సీక్వెల్ గురించి పలు ప్రశ్నలు ఎదురవగా వాటికి సమాధానం తెలిపారు.

లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. లియో సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. అయితే ఈ సినిమా ఇప్పుడే ప్రేక్షకుల ముందుకు రాదు అంటూ తెలిపారు. ప్రస్తుతం తాను రజనీకాంత్ తో సినిమా చేస్తున్నానని.. ఈ సినిమా తర్వాత ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే.. లియో 2 సినిమా పనులు మొదలు పెడతామని.. తాజాగా లోకేష్ వెల్లడించారు. దీంతో అప్పుడే అభిమానులలో అంచనాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. మరోవైపు ఖైదీ 2 సినిమాలో ఎల్సీయూలో ఉన్న పాత్రలు అన్నీ కూడా కనిపించబోతున్నాయని గతంలో లోకేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు