Dilraju: వారసుడు

దిల్ రాజ్ సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.
దిల్ రాజ్ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే చాలు
ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు దారులు తీస్తారు.
ఈ ప్రొడ్యూసర్ మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి దారి తీసిన విషయం తెలిసిందే.

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన ప్రతి సినిమాకి దిల్ రాజు వైఫ్ పేరుతో అనిత ప్రెజంట్స్ అనే టైటిల్ ను పడుతుంది.
దాదాపు ఐదేళ్ల క్రితం అనారోగ్య కారణంగా దిల్ రాజ్ వైఫ్ అనిత మరణించారు. ఆ తీవ్రమైన బాధనుండి బయటకు రావడానికి దిల్ రాజ్ కి చాలా టైమ్ పట్టింది. తరువాత దిల్ రాజు తీసుకున్న రెండో పెళ్లి నిర్ణయానికి తన కూతురు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో “వ్యఘా రెడ్డి” ను పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు దిల్ రాజు వారి సతీమణి వ్యఘా రెడ్డి దంపతులకు ఈరోజు ఒక మగ బిడ్డ జన్మించాడు. దిల్ రాజు ప్రస్తుతం ఇలయథలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకుడిగా “వారసుడు” సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో దిల్ రాజ్ ఇంట వారసుడు జన్మించటం శుభసూచకమైన యాదృచ్చికం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు