Die Hard Fan : హీరోయిన్-అభిమాని మధ్య కథే ‘డై హార్డ్ ఫ్యాన్‘

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ ముఖ్య‌పాత్రల్లో రాబోతున్న సినిమా “డై హార్ట్ ఫ్యాన్”. అభిరామ్ ఎం దర్శకత్వంలో తెరకెక్కుతుంది. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ప్రియాంక శర్మ నటిస్తున్నారు. హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి కనిపించబోతున్నాడు. హీరోయిన్ కి, అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామానే ఈ సినిమా కథ.

ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో షకలక శంకర్, కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. ష‌క‌ల‌క శంక‌ర్ పాత్ర పూర్తి వినోదంగా ఉంటుందని మూవీ యూనిట్ తెలిపారు. సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటి ఓ అభిమాని, త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. ఈ చిత్రం లో అన్ని పాత్ర‌లు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి. ఈ క్రమంలో సినిమాలో వచ్చే మలుపులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంగీతాన్ని మధు పొన్నాస్ అందించాడు. అలాగే మాటలను సయ్యద్ తేజుద్దీన్ రాశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు