Raviteja : దీపావ‌ళికి డ‌బుల్ ద‌మాకా

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు క్రాక్ వంటి బంప‌ర్ హిట్ మూవీ త‌రువాత మ‌ళ్లీ స‌క్సెస్ రాలేదు. భారీ అంచనాలతో గత నెలలో విడుదలైన రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. రొటీన్ స్టోరీ కారణంగా బాక్సాఫీస్ వద్ద త‌ట్టుకోలేక‌పోయింది. ఈ ఫెయిల్యూర్ తో నిరాశపడిన అభిమానుల్లో ధమాకా తో జోష్ నింపేందుకు రవితేజ రెడీ అవుతున్నారు. రవితేజ మార్క్ కామెడీ అంశాలతో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటిస్తోంది. పెళ్లి సందడితో కథానాయకగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఇది రెండో సినిమా. ధమాకా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుంది. ప్రసన్నకుమార్ బెజవాడ కథను అందిస్తున్నారు. టి.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్‌డేట్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన నిన్ను సూడ బుద్ధయిందయి తాద్ది రాజికో మాటాడ బుద్ధయితాంది రాజగో అంటూ సాగే ఫోక్ పాట అందరినీ ఆకట్టుకుంది.

తెలంగాణ సాహిత్యంతో సాగిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ రాయగా బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట రవితేజ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుంచి బ్లాస్ట్‌ లాంటి అప్డేట్‌ ఇస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే.. రేపు ఉదయం ధమాకా టీజర్‌ అప్డేట్‌ ఇస్తారని సమాచారం. దీవాళి రోజున ధమాకా టీజర్‌ చేస్తున్నట్లు రేపు.. ఉదయం 10 గంటలకు అఫిషీయల్‌ గా ప్రకటించే ఛాన్స్‌ ఉందని టాక్‌ వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు