Allu Arjun : మెగా కాంపౌండ్ లో ఏం జరుగుతుంది..?

టాలీవుడ్ ను మూడు కుటుంబాలు ఏలేస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహంలో లేదు. అందులో మెగా సార్ట్ కుటుంబం మొదటి వరుసలో ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతో మంది హీరోలు ఈ మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతే కాకుండా దాదాపు అందరూ కూడా స్టార్ హోదా ఉన్న వారే.

అయితే జనసేన పార్టీ పెట్టి, రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పార్టీకి మెగా ఫ్యాన్స్ సపొర్టు కావాలని ఇటీవల మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి బ్యానర్లు పెద్ద వివాదాన్నే తీసుకొచ్చాయి. మెగా ఫ్యామిలీ అంటే, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగ బాబు అన్నట్టు, అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ కాదనట్టు పోస్టర్లున్నాయి.

అంతే కాకుండా, ఈ సమావేశంలో మెగా ఫ్యాన్స్ సంఘం కీలక సభ్యుడు.. చిరంజీవి బ్యాగ్రౌండ్ తో ఎదిగిన అల్లు అర్జున్, ఇప్పుడు అన్నీ మర్చిపోయాడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే అల్లు అర్జున్ పల్లకి మోయాల్సిన అవసరం మెగా ఫ్యాన్స్ కు లేదని అన్నాడు. దీంతో ఇప్పటికే మొదలైన వివాదం, ఇంకా పెద్దదిగా మారింది.

- Advertisement -

ట్విట్టర్ వేదికగా బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై ఫైర్ అవుతున్నారు. “ ఏం పీకలేరు బ్రదర్ “ ( #EmPeekaleruBrother ) అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తెచ్చారు. ఎవరి సపోర్టు లేకున్నా, ఐకాన్ స్టార్ వరకు బన్నీ వచ్చాడంటూ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

అయితే మెగా కాంపౌండ్ లో నిజాంగానే ఇలాంటి ప్రకంపనలు జరుగుతున్నాయా..? లేదా కావాలనే కొందరి ఇలాంటి వాటిని సృష్టిస్తున్నారా..? అని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీ విషయంలో గానీ, పవన్ – శ్రీ రెడ్డి వివాదంలో గానీ అల్లు అర్జున్ స్పందించిన తీరును ప్రస్తావిస్తూ, అల్లు అర్జున్ – మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి వివాదాలు లేవని, కొత్తగా ఏమీ సృష్టించవద్దని అంటున్నారు.

మొత్తంగా ఈ వివాదం తగ్గాలంటే, బన్నీ, గానీ మెగా ఫ్యామిలీ గానీ స్పందించాల్సిందేనని మరొ కొందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు