Pawan Kalyan: బ్రో… డేట్ వచ్చేసింది

బ్రో మూవీ రిలీజ్‌కి ఇంకా తొమ్మిది అంటే తొమ్మిది రోజులే ఉంది. ప్రమోషన్స్ పెద్దగా లేవు. రెండు మూడు సాంగ్స్‌ను రిలీజ్ చేశారు. అందులో ఒక్క ఫస్ట్ సాంగ్ మినహా ఏదీ కూడా హైప్ ని క్రియేట్ చేయలేకపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హోప్ పెట్టుకుంది ఒక ట్రైలర్ పైనే. అయితే ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న బ్రో మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న మూవీ బ్రో. ఇది తమిళంలో వచ్చిన వినోదయ సీతం మూవీకి ఆఫీషియల్ రీమేక్. సముద్ర ఖని డైరెక్షన్ చేస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మూవీ అని అనౌన్స్ చేసిన రోజు నుంచి బ్రో మూవీ హై బజ్ ఏర్పడింది. తర్వాత ఈ సినిమాలో పవర్ స్టార్ దేవుడి పాత్ర అంటే ఎక్స్పెక్టేషన్స్ మరీ పీక్స్ కి వెళ్లిపోయాయి.

నిజానికి పవన్ ని ఫ్యాన్స్ దేవుడిలానే ఆరాధిస్తారు. అలాంటిది సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ ని దేవుడిగా చూస్తే ఎలా ఉంటుంది. పూనకాలు వచ్చే మూముంట్ కదా. అందుకే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం అంతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

అయితే జులై 28న విడుదల కాబోయే బ్రో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఫ్యాన్స్ ఆరాధ్య దైవం పవన్ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ పై ప్రొడ్యూసర్ అప్డేట్ ఇచ్చేశాడు. అన్ని కుదిరితే ఈ నెల 21న విడుదల చేయబోతున్నారట. ఒక వేళ 21న కుదురకపోయినా, నెక్ట్స్ డేనే విడుదల చేస్తారని ప్రొడ్యూసర్ టిజీ విశ్వ ప్రసాద్ అనౌన్స్ చేశాడు.

అంటే బ్రో మూవీ ట్రైలర్ ఈ నెల 21న లేదా 22న వచ్చేస్తోంది అన్నమాట. మరి ఈ ట్రైలర్ సినిమా రిలీజ్ పై ఎంతటి హైప్ క్రియేట్ చేస్తోందో చూడాలి మరి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు