Bollywood : ఆధారం టాలీవుడ్డే !

బాలీవుడ్, సినీ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న ఇండస్ట్రీ. మన దేశంలో అతి పెద్ద సినీ ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే, బాలీవుడ్ అని ఎవరైనా చెబుతారు. బీ టౌన్ లో స్థిరపడాలని, అక్కడ సినిమాలు చేయాలని దేశంలో ఉన్న చాలా మంది నటీ నటుల లక్ష్యం. అంతలా ఆదరణ ఉన్న బాలీవుడ్, ఇప్పుడు పక్క ఇండస్ట్రీలపై ఆధారపడాల్సి వస్తుంది. గత కొద్ది రోజుల నుండి “ది కశ్మీర్ ఫైల్స్” మినహా బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇదే సమయంలో టాలీవుడ్, సినీ ప్రపంచంలో చిన్న పరిశ్రమ. కానీ, “బాహుబలి” “పుష్ప” “ఆర్ఆర్ఆర్” లాంటి సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా అలరించాయి. దీంతో బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలు తెలుగు చిత్ర సీమనే ఫాలో అవుతున్నాయి. అలాగే తెలుగు స్టార్స్ ను తమ సినిమాల ప్రమోషన్స్ కోసం, కీలక పాత్రల కోసం ఎంచుకుంటున్నారు.

బాలీవుడ్ హాట్ కపుల్ రణ్ బీర్ కపూర్ – అలియా భట్ నటిస్తున్న “బ్రహ్మాస్త్ర” టీం అయితే మరో అడుగు ముందుకు వేసి, సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరోను, డైరెక్టర్ భాగం చేస్తుంది. దర్శకదీరుడు ఎస్. ఎస్. రాజమౌళి సమర్పణలో ఈ సినిమా తెలుగు వర్షన్ వస్తున్న విషయం తెలిసిందే. అనీష్ శెట్టి అనే పాత్రలో కింగ్ నాగర్జున నటిస్తున్నాడు. అంతే కాకుండా ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి తన వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇలా ఒకప్పుడు భారతీయ చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్, ప్రస్తుతం పక్క ఇండస్ట్రీలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ దీనికి కారణం టాలీవుడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే, తెలుగు డైరెక్టర్స్, అన్ని భాషల సినీ ప్రేక్షకులు నచ్చే కథలతో సినిమాలు చేయడం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు