Double Ismart: డబుల్ ఇస్మార్ట్ లో ఆ బాలీవుడ్ హీరో..?

Double Ismart: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఇస్మార్ట్‌ శంకర్‌ ఒకటి. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయింది.

ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి విజయం సాధించాలని రామ్ చూస్తున్నారు. ఇక హీరో రామ్ బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. 85 నిమిషాల నిడివితో ఉన్న టీజర్ లో పూరీ తన మార్క్ ను చూపించాడు. అంతేకాకుండా రామ్ మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే….డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ హీరోగా నటించనని చెప్పుంటే ఓ బాలీవుడ్ హీరో ఈ సినిమా చేసి ఉండేవాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు…. షాహిద్ కపూర్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ మాస్ ఇమేజ్ తో యమ జోరు చూపించాడు.

- Advertisement -

వరుస చిత్రాలలో నటించాడు. అలాంటి సమయంలో పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ స్టోరీ రెడీ చేసుకుని రామ్ ను కలిసారట. ఒకవేళ ఏదైనా కారణం చేత రామ్ ఈ సినిమాకు నో చెబితే టైటిల్ మార్చేసి సేమ్ స్టోరీతో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో సినిమా చేయాలని అనుకున్నాడట. ఈ సినిమాలో రామ్ తప్పితే షాహిద్ కపూర్ ఈ సినిమాకు బాగా సెట్ అవుతాడని పూరి జగన్నాథ్ అనుకున్నారట. కానీ ఈ సినిమా స్టోరీ రామ్ కు బాగా నచ్చిందట. స్టోరీ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి లైగర్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో వేసుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు