Bimbisara Trailer Glimpse : ‘బింబిసార’ ట్రైలర్ గ్లింప్స్

ఈ మధ్య కాలంలో ట్రైలర్ రిలీజ్ కు ముందు కూడా ఆ ట్రైలర్ కు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేస్తున్నారు.ట్రైలర్ లో ఎన్ని విజువల్స్ ఉంటాయి అనే దానిని కొన్ని క్షణాల పాటు చూపించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ‘ఆర్.ఆర్.ఆర్’ తో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత ‘పుష్ప’ ‘సర్కారు వారి పాట’ చిత్రాలకి కూడా కంటిన్యూ అయ్యింది. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ‘బింబిసార’ ట్రైలర్ కు సంబంధించి కూడా ఓ గ్లింప్స్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. టీజర్ తోనే మంచి అంచనాలు క్రియేట్ చేసింది ‘బింబిసార’.

మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకుడు. వశిష్ట్ కు దర్శకుడిగా ఇదే మొదటి చిత్రం. డైరెక్టర్ గా మారుతూనే ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే సాహసం చేయడం అంటే మాములు విషయం కాదు. కానీ టీజర్ తో పాటు తాజాగా విడుదలైన గ్లింప్స్ తో కూడా ‘ ‘బింబిసార’ లో మేటర్ ఉంది’ అనే ఆసక్తి అందరిలోనూ కల్పించాడు. ‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’ అనే డైలాగ్ ఈ గ్లింప్స్ లో హైలెట్ గా నిలిచింది.
మొత్తంగా ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ గ్లింప్స్ ను తలపించేలా ‘బింబిసార’ ట్రైలర్ గ్లింప్స్ ఉందని చెప్పొచ్చు. ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని కూడా క్రియేట్ చేసింది ఈ గ్లింప్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు