Bimbisara : బడ్జెట్ పెట్టారు కానీ బిజినెస్ ?

కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది బింబిసార. ఈ చిత్రానికి దాదాపు 45 కోట్ల బడ్జెట్ అయ్యింది అని వినికిడి. హరికృష్ణతో కలిసి కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. కళ్యాణ్ రామ్ సేఫ్ అవ్వాలి అంటే, 50 కోట్ల బిజినెస్ జరగాలి. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మార్కెట్ 20 కోట్లు మాత్రమే. థియేట్రికల్ బిజినెస్ 10 కోట్లు అనుకున్నా, నాన్ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల వరకు ఉంది. అంటే రెండింతలు బిజినెస్ జరగాలి.

నైజాం హక్కులను రూ.5.5 కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నారు అని టాక్. అలాంటి పెద్ద నిర్మాత అంత మొత్తం ఈ సినిమా పై పెట్టాడు అంటే, మిగిలిన బయ్యర్స్ కు కూడా బింబిసార పై నమ్మకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే నిర్మాతలు డిజిటల్ రైట్స్ ను ఇంకా అమ్మడం లేదు అని వినికిడి. సినిమా పై వారికి ఉన్న నమ్మకం వల్ల రిలీజ్ తర్వాత ఇంకా మంచి రేటు వస్తుంది అని భావిస్తున్నారట. ఈ రకంగా చూస్తే బింబిసార టీమ్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు