Bhaje Vaayuvegam : భజే వాయువేగం బ్రేక్ ఈవెన్ టార్గెట్.. టార్గెట్ చిన్నదే అయినా పోటీ పెద్దది!

Bhaje Vaayuvegam : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అయిన కార్తికేయ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బెదురులంక 2012 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో కార్తికేయ, ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు “భజే వాయు వేగం” (Bhaje VaayuVegam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. ఇంతకు ముందు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, గానిట్రైలర్ గాని ఆసక్తి కలిగించే విధంగా ఉండగా, బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చూపించే అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ను డీసెంట్ గా ప్రమోట్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఈ సినిమా 300 రేంజ్ లో స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా, వరల్డ్ వైడ్ గా 400 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ తాజాగా వచ్చాయి.

Bhaje Vaayuvegam movie Business & break even target

డీసెంట్ బిజినెస్ చేసిన చిన్న సినిమా..

ఇక “భజే వాయువేగం” సినిమాను మేకర్స్ తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా, ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.4 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుందని అంచనా. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఓవరాల్ గా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని కనుక సొంతం చేసుకుంటే, బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక పోటిలో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కి మౌత్ టాక్ ఇప్పుడు చాలా ముఖ్యం అని చెప్పాలి. టాక్ బాగుంటే ఓపెనింగ్స్ ఎలా ఉన్నా లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ ఒక రాబరీ చేస్తాడని సమాచారం.

- Advertisement -

భజే వాయువేగం తో మరో సక్సెస్ అందుకుంటాడా?

ఇక కార్తికేయ భజే వాయువేగం (Bhaje Vaayuvegam) సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా, ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రవి శంకర్, తనికెళ్ళ భరణి, కృష్ణ చైతన్య, శరత్ లోహిత్సవ, బబ్లూ పృత్వి రాజ్, అలాగే హ్యాపీ డేస్ టైసన్ ఫేమ్ రాహుల్ కీలక పాత్రల్లో నటించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక దీనికి పోటీగా రేపు విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు కార్తికేయ. మరి ఇంత పోటీలోనూ భజేవాయువేగం సినిమాతో ఎంతవరకు కార్తికేయ సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు